Warangal: వరంగల్ లో అక్రమ అబార్షన్ ల గుట్టురట్టు..
పుట్టబోయేది ఆడపిల్ల అని తెలీగానే కొంతమంది గర్భంలోనే చిదిమేస్తుంటే.. కొంత మంది ఆడ పిల్ల పుడితే అదృష్టంగా భావిస్తున్నారు. అయితే పుట్టబోయేది అమ్మాయి అని తెలియగానే గర్భంలోనే చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా వరంగల్ లో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలో తాజాగా ఒక వ్యక్తి తనకు కూతురు పుట్టిందని ఆనందంతో ఎగిరి గంతేశాడు. అంతే కాకుండా ఆ పాప మొదటి సారి ఇంట్లో అడుగు పెట్టబోతున్న సమయంలో ఏనుగు అంబారీ ఏర్పాటు చేసి మరీ కూతురుకు స్వాగతం పలికాడు. ఏనుగు పై తన కూతురు ను ఒడిలో కూర్చోబెట్టుకుని ఊరేగింపుగా ఇంటికి తీసుకు వెళ్లాడు.
ఒక వైపు కూతురు అంటే అంతటి ప్రేమను కనబర్చుతూ ఉంటే మరో వైపు మాత్రం గర్భంలోనే చిదిమేయాలని చూస్తున్నారు. పుట్టబోయేది ఆడ బిడ్డ అంటూ తెలిసి అత్యంత కర్కషంగా ఆ పని చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కూడా కొందరు ఈ దారుణమైన పనిని చేస్తున్నారు. ఈ కంప్యూటర్ యుగంలో కూడా లింగ వివక్ష ఉంది అంటే ఇతర దేశాల్లో జనాలు నవ్వే పరిస్థితి. ఇండియాలో మాత్రమే ఇలాంటి పరిస్థితి దాపరించడం దారుణం.
దేశంలో లింగ నిర్థారణ అనేది చట్టపరంగా నేరం. అయినా కూడా అనధికారికంగా పలు ఆసుపత్రుల్లో మరియు స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేస్తున్నారు. ఆడ పిల్ల అని తెలిసి చాలా మంది అబార్షన్ కు సిద్ధం అవుతున్నారు. అబార్షన్ లను కూడా భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని చిన్న ఆసుపత్రుల నుండి పెద్ద ఆసుపత్రుల వరకు చేయడం జరుగుతుంది.
తాజాగా వరంగల్ లో భారీ ఎత్తున అక్రమ అబార్షన్ లు జరుగుతున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో గత పది రోజులుగా స్కానింగ్ సెంటర్లు మరియు ఆసుపత్రులపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
Also Read: చెన్నై vs గుజరాత్ ఫైనల్ మ్యాచ్.. ఈ రికార్డులపై ఓ లుక్కేయండి! ధోనీని ఊరిస్తున్న రికార్డ్స్
ఆర్‌ఎంపీల సహకారంతో పలు ఆసుపత్రులు ఈ దందాను చేస్తున్నట్లుగా వెళ్లడి అయ్యింది. హన్మకొండ నర్సంపేట్ లోని ఇద్దరు గైనకాలిస్టులను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ విషయమై ప్రశ్నిస్తున్నారు. వరంగల్ పరిధిలో భారీ ఎత్తున లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లుగా వెళ్లడి అయ్యింది. ఆర్‌ఎంపీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
మొత్తానికి వరంగల్ టాక్స్ ఫోర్స్ పోలీసుల సోదాలు మరియు ఎంక్వౌరీలో షాకింగ్ విషయాలు వెళ్లడి అయ్యాయి. పలువురు డాక్టర్లు మరియు ఆర్‌ఎంపీలు ఇంకా ఇతర స్కానింగ్ సెంటర్ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే ఈ లింగ నిర్ధారణ వ్యవహారం మరియు అబార్షన్ లకు సంబంధించిన గుట్టు రట్టు అయినట్లుగా టాస్క్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు.
Also Read: LPG Cylinder Price: జూన్ నెల నుంచి కొత్త ధరలు.. ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గే అవకాశం..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి